Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మహేష్ ఎమోషనల్ ట్వీట్

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మహేష్ ఎమోషనల్ ట్వీట్
x
Super star krishna, Mahesh babu(File photo)
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ తన పుట్టినరోజు ప్రతి ఏడాది అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ తన పుట్టినరోజు ప్రతి ఏడాది అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటారు.అయితే గత సంవత్సరం ఆయన సతీమణి విజయనిర్మల మరణించడంతో కృష్ణ ఈసారి ఎలాంటి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. అభిమానులు కూడా కృష్ణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం లేదు. కాగా.. కృష్ణ పుట్టినరోజును ఆయన కొడుకు మహేష్ బాబు చాలా స్పెషల్ డేగా చూస్తుంటాడు. ఈ సందర్భంగా మహేష్ తండ్రికి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ట్విట్టర్ వేదికగా మహేష్ తన తండ్రితో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ, తన తండ్రికి జీవితాంత రుణపడి ఉంటానంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. నాన్న తన ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ అంటూ తండ్రికి పుట్టినరోజు విషెస్ చెప్పుకొచ్చాడు.

ఇక ప్రతి ఏడాది కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులకు అందిస్తారు. ఈ సారి కూడా ఫ్యాన్స్ కు గిఫ్ట్ అందించేందుకు రెడీ అయ్యాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories