Mahesh Babu : సోదరుడి మృతిపై మహేశ్‌ బాబు తీవ్ర భావోద్వేగం.. ఎమోషనల్‌ పోస్ట్‌

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే జరిగాయి.

Arun Chilukuri
Updated on: 9 Jan 2022 3:16 PM IST
Mahesh Babu Emotional Note Mourning the Demise of his Brother Ramesh Babu
X

Mahesh Babu : సోదరుడి మృతిపై మహేశ్‌ బాబు తీవ్ర భావోద్వేగం.. ఎమోషనల్‌ పోస్ట్‌

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే జరిగాయి. సినీ ప్రముఖులు రమేశ్ కు ఘననివాళుర్పించారు. అయితే ఇందులో మరో దురదృష్టం ఏంటంటే.. ఇటీవల కరోనా బారిన పడ్డ మహేశ్ బాబు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న కారణంగా అన్నగారి చివరిచూపులకు కూడా నోచుకోలేకపోయారు. తన సోదరుడు రమేష్‌ బాబు ఆకస్మిక మృతిపట్ల నటుడు మహేశ్‌ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రమేష్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు.

'మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story