Mahesh Babu: త్రివిక్రమ్ కోసం నైట్ అవుట్ లు చేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu: రాత్రుల్లో షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు

Dhatripriya
Updated on: 26 March 2023 7:30 PM IST
Mahesh Babu Doing Night Outs For Trivikram
X

Mahesh Babu: త్రివిక్రమ్ కోసం నైట్ అవుట్ లు చేస్తున్న మహేష్ బాబు 

Mahesh Babu: "సర్కారు వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు 11న థియేటర్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ లను కూడా వరుసగా గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. త్రివిక్రమ్ స్టైల్ లో ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. మలయాళం ప్రముఖ నటుడు జయరాం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. "అల వైకుంఠపురం" సినిమా లో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో కనిపించిన జయరాం ఇప్పుడు ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించనున్నారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ రాత్రిపూట జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని భారీ సెట్స్ ను నిర్మించారు. అందులోనే నైట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. దీంతో చిత్ర బృందం నిద్ర మానుకొని రాత్రులు షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటుందట. ఇందులో భాగంగా కొన్ని యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కూడా జరుగుతున్నట్లు సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story