మిస్‌ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్‌ పోస్ట్‌..

Mahesh Babu Daughter Sitara: మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి బుధ‌వారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 29 Sept 2022 11:47 AM IST
Mahesh Babu Daughter Sitara Emotional Post On Indira Devi Demise
X

మిస్‌ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్‌ పోస్ట్‌..

Mahesh Babu Daughter Sitara: మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి బుధ‌వారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. సీనియర్ నటుడు కృష్ణ‌, మ‌హేష్ స‌హా కుటుంబ స‌భ్యులు శోక సంద్రంలో మునిగి ఉన్నారు. అయితే మరీ ముఖ్యంగా నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివ దేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరినీ కలిచివేసింది. కూతురు ఏడుస్తుంట్ మహేశ్‌ దంపతులు ఆమెను ఓదార్చడం అందరి హృదయాలను బరువెక్కించింది.

కాగా బుధవారం సాయంత్రం ఇందిరా దేవి అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్‌, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్టులు పెట్టారు. అలాగే సితార కూడా భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసింది. 'మిస్‌ యూ సో మచ్‌ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా' అంటూ నానమ్మ, అన్న గౌతమ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది సితార. దీనికి హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జత చేస్తూ భావోద్వేగానికి గురైంది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story