పరశురామ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న మహేష్ బాబు...

Mahesh Babu: పరశురామ్ రైటింగ్ లో ఒక స్పార్క్ ఉంటుంది...

Shireesha
Updated on: 11 May 2022 7:30 PM IST
Mahesh Babu Compliments on Sarkaru Vaari Paata Director Parasuram | Tollywood News
X

పరశురామ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న మహేష్ బాబు...

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో త్వరలో థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమా "సర్కారు వారి పాట". కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా డైరెక్టర్ గురించి గొప్పగా మాట్లాడారు మహేష్ బాబు. సినిమా క్రెడిట్ మొత్తం పరశురామ్ కే దక్కుతుందని తన పాత్రని చాలా బాగా విభిన్నంగా తీర్చిదిద్దారు అని అన్న మహేష్ బాబు షూటింగ్ సమయంలో తనకి తన "పోకిరి" సినిమా షూటింగ్ రోజులు గుర్తొచ్చాయి అని అన్నారు.

"పరశురామ్ కథ చెబుతున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇలాంటి కథ చేసి చాలా రోజులైంది. పరశురామ్ రైటింగ్ లో ఒక స్పార్క్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. ఒక రైటర్ డైరెక్టర్ గా మారితే అది నిజంగా చాలా బాగుంటుంది" అని అన్నారు మహేష్ బాబు. సినిమా లో డైలాగులు గురించి మాట్లాడుతూ కథ మరియు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కొన్ని డైలాగులు చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

తమన్ సంగీతం గురించి మాట్లాడుతూ కళావతి పాట ముందు తనకి నచ్చలేదని, స్లో మెలోడీ కాబట్టి కొంచెం అనుమానం పడ్డామని అన్న మహష్, "కానీ తమన్ మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాడు. పాట నా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అవుతుందని అన్నాడు. ఇప్పుడు నా పర్సనల్ ఫేవరెట్ పాట కూడా అదే," అని అన్నారు మహేష్ బాబు.

Shireesha

Shireesha

Next Story