Mahesh Babu: పరశురామ్ ని పూరి జగన్నాథ్ తో పోల్చిన మహేష్ బాబు

Mahesh Babu: చిత్ర దర్శకుడు పరుశురాం దర్శకత్వాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం తో పోల్చారు మహేష్.

admin1
Updated on: 6 Dec 2021 3:34 PM IST
Mahesh Babu Compares Parashuram with Puri Jagannadh
X

పరశురామ్ ని పూరి జగన్నాథ్ తో పోల్చిన మహేష్ బాబు 

Mahesh Babu: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు మహేష్ బాబు. ఈ చిత్ర దర్శకుడు పరుశురాం దర్శకత్వాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం తో పోల్చారు మహేష్.

"ఈ సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఉండే స్టైల్ మరియు ఎసెన్స్ ఉంటాయి. నేను ఇలాంటి ఒక పూర్తి ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనింగ్ సినిమా చేసి చాలా కాలమైంది" అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. కోలీవుడ్ నటుడు సముథిరఖని ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి మహేష్ బాబు ఎంటరటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతోంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story