హాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

*హాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

Rama Rao
Published on: 8 April 2022 10:47 AM IST
Mahesh Babu Clarifies on Hollywood Entry | Tollywood News
X

హాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

Mahesh Babu: "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు పరుశురామ్ డైరెక్షన్లో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా మహేష్ బాబు హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి మహేష్ బాబు టాలీవుడ్ లో తప్ప బాలీవుడ్లో కూడా సినిమా చేసే ఆసక్తిని చూపించలేదు.

మరి అలాంటి మహేష్ బాబు హాలీవుడ్ సినిమాని ఓకే చేశారంటే అభిమానులు కూడా షాక్ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వెళ్ళిన ఆ మహేష్ బాబు అక్కడ ప్రెస్ తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. రాజమౌళి సినిమా గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని అన్న మహేష్ బాబు హాలీవుడ్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

"నాకు ఏ హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి కూడా తెలియదు" అని ఇన్ డైరెక్ట్ గా తను హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వట్లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక "సర్కారు వారి పాట" సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

Rama Rao

Rama Rao

Next Story