Mahesh Babu: టెక్నోపెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు

Mahesh Babu: అట్టహాసంగా టెక్నో పేయింట్స్ కంపెనీ టీవీసీ ఆవిష్కరణ

Jyothi
Published on: 29 Jun 2023 8:31 AM IST
Mahesh Babu Brand Ambassador For Techno Paints
X

Mahesh Babu: టెక్నోపెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు

Mahesh Babu: పెయింటింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్న టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఎంపిక చేసింది. మహేశ్ బాబుచేత రూపొందించిన టెలివిజన్ కమర్షియల్ యాడ్‌ను ఆవిష్కరించారు. మాధాపూర్ సమీపంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, రాజ్య సభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్, ఇన్ప్రా స్ట్రక్చర్స్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

టెక్నోపెయింట్స్ ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. '22 ఏళ్ల సంస్థ ప్రస్థానంలో నాణ్యమైన రంగులు, పెయింట్స్ సర్వీస్‌తో బిజినెస్ టు బిజినెస్ విభాగంలో విజయవంతమయ్యామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా 1,000కి పైగా ప్రాజెక్టులు పూర్తిచేశామన్నారు. యూత్ ఐకాన్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుంది. భారత పెయింట్స్ రిటైల్ రంగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్న లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

మల్టీనేషనల్ కంపెనీలు మాత్రమే కలర్ బ్యాంక్స్ ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో టెక్నో పెయింట్స్ ఆధ్వర్యంలో రెండు వేల షేడ్స్‌లో పెయింట్స్ రూపొందిస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో వెయ్యి షేడ్లను కొత్తగా జోడించబోతున్నామని పేర్కొన్నారు. వినియోగదార్లకు సకాలంలో సక్రమంగా పెయింట్లను చేర్చేందుకు 25 డిపోలను ఏర్పాటుచేశామన్నారు. పటాన్ చెరులో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్ వేర్ హౌజ్ ను ఏర్పాటు చేశామన్నారు. కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష మెట్రిక్ టన్నులు ఉంది. వచ్చే ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, విశాపట్నంతో పాటు ఒరిస్సాలో నెలకొల్పుతున్న ప్లాంట్లతో 2లక్షల 50వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని అందుకుంటామన్నారు.

Jyothi

Jyothi

Next Story