#SSMB28 గురించి వైరల్ అవుతున్న వీడియో

Mahesh Babu Birthday Special SSMB28 Video Goes Viral
x

#SSMB28 గురించి వైరల్ అవుతున్న వీడియో

Highlights

#SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో "సర్కార్ వారి పాట" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

#SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో "సర్కార్ వారి పాట" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజకీయ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు. "అతడు", "ఖలేజా" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు మరొకసారి జత కట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

#SSMB28 అని అభిమానులు ముద్దుగా పిలుస్తున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక వర్గం గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "మహర్షి" సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మధి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి నవీన్ ఎడిటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రైనింగ్ గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories