Mahesh Babu Bakrid Wishes : ముస్లిం సోద‌రుల‌కు మ‌హేష్‌ బాబు బ‌క్రీద్ విషెస్!

Mahesh Babu Bakrid Wishes : సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు..

Krishna
Updated on: 1 Aug 2020 12:05 PM IST
Mahesh Babu Bakrid Wishes : ముస్లిం సోద‌రుల‌కు మ‌హేష్‌ బాబు బ‌క్రీద్ విషెస్!
X
Mahesh babu(File Photo)

Mahesh Babu Bakrid Wishes : సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు.. అంతేకాకుండా ప్రతి పండుగ‌కి త‌న ట్విట్టర్ ద్వారా అభిమానుల‌కి శుభాకాంక్షలు అందిస్తూ ఉంటారు మహేష్ బాబు.. తాజాగా ట్విట్టర్ వేదికగా ముస్లిం సోద‌రుల‌కి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మహేష్.."బ‌క్రీద్ రోజున సార్వత్రిక‌ సోదర స్ఫూర్తిని ప్రద‌ర్శించ‌డం ఆనందంగా ఉంటుంది! ఈ సంతోషకరమైన సందర్భం సమస్యాత్మక సమయాల్లో మనందరినీ ఒకచోట చేర్చి, మనలో చైతన్యం నింపుతుంది. కొత్త ఆరంభం కోసం ఆశిస్తున్నాం" అని మహేష్ బాబు పేర్కొన్నారు.

ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ బాబు భారీ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు గీతా గోవిందం ఫేం ప‌ర‌శురాం ద‌ర్శక‌త్వంలో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాని ఇక మహేష్ బాబుకి 27వ చిత్రంగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట అనే సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

Krishna

Krishna

Next Story