EMK Promo: "సరదాగా" సాగిన మహేష్, ఎన్టీఆర్ "ఎవరు మీలో కోటీశ్వరులు" ప్రోమో

Sandeep Reddy
Published on: 23 Nov 2021 5:02 PM IST
Mahesh Babu Attended as a Guest in Evaru Meelo Koteeswarulu Episode Promo Released Today 23 11 2021
X

EMK Promo: "సరదాగా" సాగిన మహేష్, ఎన్టీఆర్ "ఎవరు మీలో కోటీశ్వరులు" ప్రోమో

Evaru Meelo Koteeswarulu Promo: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే "ఎవరు మీలో కోటీశ్వరులు" రియాలిటీ గేమ్ షోకి గెస్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబు పాల్గొనబోతున్నాడని ఆ ఛానెల్ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే మహేష్ బాబు - ఎన్టీఆర్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని "ఎవరు మీలో కోటీశ్వరులు" టీం విడుదల చేసింది. ఈ ప్రోమోలో మహేష్ బాబు - ఎన్టీఆర్ మధ్య గేమ్ లో భాగంగా జరిగే సంభాషణ సరదాగా సాగినట్లుగా కనిపిస్తుంది.

అదిరిపోయిందంటూనే కరెక్ట్ ఆన్సర్ ని అటు తిప్పి ఇటు తిప్పి అదే చెప్పడం ఏంటని మహేష్ బాబు అడగడం.. దానికి ఎన్టీఆర్ సరదాగా అంటూ ఆన్సర్ ఇవ్వడంతో గురువు గారే బెటర్ మీకంటే అని చెప్తూ నవ్వించాడు ప్రిన్స్. ఇక మహేష్ బాబుని ఎన్టీఆర్.. మహేష్ అన్న అంటూ వెల్ కమ్ చెప్పడంతో పాటు ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూస్తుండటంతో అటు మహేష్ బాబు, ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడు ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు రానుందనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా చెప్పినట్టే పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అన్నట్టుగానే టీఆర్పీ రేటింగ్‌ లో ఈ ఎపిసోడ్ రికార్డులు సృష్టిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story