Mahesh Babu: ఐటీ మినిస్టర్‌గా మహేష్ బాబు

Mahesh Babu As Politician: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..

Arun Chilukuri
Updated on: 16 July 2022 4:00 PM IST
Mahesh Babu As IT Minister
X

Mahesh Babu: ఐటీ మినిస్టర్‌గా మహేష్ బాబు

Mahesh Babu As Politician: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంతో ఉండబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఐటీ మినిస్టర్ పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో "భరత్ అనే నేను" సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ఈ సినిమాలో కూడా మంత్రి పాత్రలో కనిపించి అభిమానులను అలరించనున్నారట. "భరత్ అనే నేను" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ మంత్రి పాత్ర సెంటిమెంట్ మహేష్ బాబు కి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story