Mahesh Babu: బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మహేష్ బాబు

* "లెట్స్ డ్యూ ఇట్" అంటున్న సూపర్ స్టార్

admin1
Updated on: 4 Dec 2021 10:54 AM IST
Mahesh Babu as Brand Ambassador for Mountain Dew Soft Drink
X

బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మహేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)

Mahesh Babu: ఒకవైపు వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్ల తో కూడా అంతే బిజీగా ఉన్నాడు. తాజాగా ఒక సాఫ్ట్ డ్రింక్స్ మౌంటెన్ డ్యూ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు మహేష్ బాబు. హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా ప్రేక్షకులని అలరించడం మాత్రమే ధ్యేయంగా సూపర్ స్టార్ వరుసగా సినిమాలు చేస్తూ మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఇది వరకు థంప్స్‌అప్‌, అభి బస్‌, ఐడియా, సంతూర్‌, ప్యారగాన్ తదితర వాణిజ్య ప్రకటనలో కనిపించారు.

మహేష్ బాబు ఇప్పుడు శీతల పానీయం ఐన మౌంటెన్ డ్యూ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఇక ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు "లెట్స్ డ్యూ ఇట్" అంటూ మహేష్ బాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కి అక్కినేని అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే వారు తాజాగా ఇప్పుడు మహేష్ బాబు అఖిల్ స్థానాన్ని ఆక్రమించారు. ఇక సినిమాల పరంగా చూస్తే మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story