మహేష్ బాబు కి త్రివిక్రమ్ ఈ సారైనా హిట్ ఇస్తారా?

మహేష్ బాబు కి త్రివిక్రమ్ ఈ సారైనా హిట్ ఇస్తారా?

admin1
Published on: 28 Feb 2022 5:08 PM IST
Mahesh Babu and Trivikram Srinivas Combination | Tollywood News
X

మహేష్ బాబు కి త్రివిక్రమ్ ఈ సారైనా హిట్ ఇస్తారా?

Trivikram-Mahesh Babu: టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. అభిమానులతో మాటల మాంత్రికుడు అని పిలిపించుకునే త్రివిక్రమ్ చాలా మంది స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను అందించారు. అయితే ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాక మళ్లీ అదే కాంబినేషన్ తో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ అన్ని అంచనాల మధ్య విడుదలైనప్పటికీ కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మారుతాయి. ఉదాహరణకి జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో విడుదలైన "అజ్ఞాతవాసి" సినిమా డిజాస్టర్ గా మారింది.

అయితే తాజాగా "భీమ్లా నాయక్" సినిమా కి స్క్రీన్ ప్లే మరియు డైలాగులు అందించారు త్రివిక్రమ్. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో పై అభిమానులకు ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు కూడా త్రివిక్రమ్ నుంచి మరొక హిట్ ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా బ్లాక్బస్టర్ కాగా ఖలేజా సినిమా డిజాస్టర్ గా మారింది. కానీ ఈ సినిమాతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో మంచి హిట్ వస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.

admin1

admin1

Next Story