Mahesh Babu - Ram Charan: రామ్ చరణ్ తో చేతులు కలపనున్న సూపర్ స్టార్

Mahesh Babu - Ram Charan: మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న మహేష్ బాబు

admin1
Updated on: 9 Dec 2021 2:15 PM IST
Mahesh Babu and Ram Charan is going to on the Multi Starer Film | Tollywood Updates
X

మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న మహేష్ బాబు,రామ్ చరణ్ (ఫైల్-ఫోటో)

Mahesh Babu - Ram Charan: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "మహర్షి". పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి.

తాజాగా ఇప్పుడు తమిళ హీరో విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడు ఈ డైరెక్టర్. అయితే తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి మహేష్ బాబు తో ఇంకో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి వంశీ పైడిపల్లి ఒక మల్టీస్టారర్ సినిమా కథతో మహేష్ బాబు ని కలవబోతున్నాడట.

మరి ఈ మల్టీ స్టారర్ సినిమాలో మహేష్ బాబు తో పాటు కలిసి నటించేది మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే "సర్కారు వారి పాట" సినిమా తో ప్రస్తుతం బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా, రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

మరోవైపు రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ తో కలిసి "ఆర్ఆర్ఆర్" అనే మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక వీరిద్దరికీ ఉన్న కమిట్ మెంట్లు పూర్తయిన తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పట్టలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story