రాజమౌళి మరియు మహేష్ బాబు మధ్య స్టోరీ డిస్కషన్లు జరగలేదా?

* రాజమౌళి మరియు మహేష్ బాబు మధ్య స్టోరీ డిస్కషన్లు జరగలేదా?

Rama Rao
Updated on: 26 April 2022 3:30 PM IST
Mahesh Babu and Rajamouli Meet in Dubai | Telugu Movie News
X

రాజమౌళి మరియు మహేష్ బాబు మధ్య స్టోరీ డిస్కషన్లు జరగలేదా? 

Mahesh Babu-Rajamouli: సార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈమధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మహేష్ బాబు కూడా పరుశురామ్ డైరెక్షన్లో చేస్తున్న "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ని పూర్తి చేసుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తన భార్య మరియు పిల్లలు తో కలిసి వెకేషన్ కి వెళ్ళారు. మరోవైపు రాజమౌళి కూడా తన కుటుంబ సభ్యులతో హాలిడే కి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు దుబాయ్ కి వెళ్ళినట్లు అక్కడ కలుసుకున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే మహేష్ బాబు మరియు రాజమౌళి కలిసి స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారని సందేహాలు మొదలయ్యాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం అది కేవలం క్యాషువల్ మీటింగ్ అని కావాలని ప్లాన్ చేసుకొని కలవలేదని ఎలాంటి స్టోరీ డిస్కషన్లు జరగలేదు అని తెలుస్తోంది. మరో వైపు మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఇప్పుడు పారిస్ కి వెళ్లారు. రాజమౌళి దుబాయ్ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ కి త్వరలోనే తిరిగి రాబోతున్నారు. వీరిద్దరి సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story