Mahesh Babu: తండ్రిగా గర్వపడుతున్నా..

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 May 2024 12:51 PM IST
Mahesh Babu And Namrata Shirodkars Son Gautams Graduation Ceremony
X

Mahesh Babu: తండ్రిగా గర్వపడుతున్నా..

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో ఆయన షేర్ చేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గౌతమ్ ను మహేష్ బాబు అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలను గౌతమ్ అందుకోవాలని మహేష్ బాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. తన కలలను సాకారం చేసుకోవాలని కోరుకున్నారు. ఓ తండ్రిగా ఈరోజు తాను గర్వపడుతున్నానని మహేష్ బాబు చెప్పారు.

మహేష్ బాబు పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గౌతమ్ ను అభినందించారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.

షూటింగ్ లేకపోతే కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికే మహేష్ బాబు సమయం కేటాయిస్తారు. మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. డ్యాన్స్, సినిమాలకు సంబంధించిన వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story