సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరు, మహేష్ కోటి రూపాయల విరాళం!

సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరు, మహేష్ కోటి రూపాయల విరాళం!
x
Highlights

CM Relief Fund : మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. శతాబ్ద కాలంగా ఎప్పుడూలేనంత భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయని, భారీగా ప్రాణనష్టం జరిగిందని చిరంజీవి ట్విట్టర్‌లో తెలిపారు.


గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వర్ష బీభత్సంతో హైదరాబాద్ నగరం తల్లిడిల్లిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. శతాబ్ద కాలంగా ఎప్పుడూలేనంత భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయని, భారీగా ప్రాణనష్టం జరిగిందని చిరంజీవి ట్విట్టర్‌లో తెలిపారు.

ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఊహించలేనంత విలయం జరిగిందన్నారు మహేశ్ బాబు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వీలైనంతగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో మన ప్రజలకు మనందరం అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.

సినీ నటులు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని నాగార్జున అన్నారు. తక్షణ పునరావాస కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం 550 కోట్లు విడుదల చేయడం సంతోషకరమని చెప్పారు. ఈ విపత్తు సమయంలో బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌ 50 లక్షల విరాళం ప్రకటించారు.

తన వంతు సాయంగా సీఎం రీలీఫ్ ఫండ్‌కు 10 లక్షలు ఇస్తున్నానని తెలిపారు విజయ్‌ దేవరకొండ. మరోవైపు దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ కూడా బాధితులకు తాము కూడా అండగా ఉన్నామన్నారు. చెరొక 5 లక్షల వంతున సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మేఘా కృష్ణారెడ్డి సీఎంఆర్ఎఫ్‌కు 10 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. ఇక మైహోమ్‌ గ్రూప్ 5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్‌కు అందజేసింది. ప్రకృతి విలయం కారణంగా నష్టపోయిన వారి పట్ల తన హృదయం ద్రవించిపోతోందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories