మహేష్ సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్

Ruthvik
Published on: 27 April 2019 4:10 PM IST
మహేష్ సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్
X

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి: సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది

ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. 'పటాస్' సినిమాను పక్కన పెడితే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మిగతా మూడు చిత్రాల టైటిల్స్ 'సుప్రీం', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2' కోసం ఇంగ్లీష్ పదాలు వాడారు. కానీ మహేష్ సినిమా కోసం ఈ సెంటిమెంట్ ను అనిల్ రావిపూడి పక్కన పెట్టనున్న సంగతి అర్థమవుతోంది. మరి ఈ సినిమా అనిల్ రావిపూడి కి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి. మహేష్ బాబు కెరీర్ లో 26వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Ruthvik

Ruthvik

Next Story