అడివి శేష్ కి సలహా ఇచ్చిన మహేష్ బాబు

Mahesh Babu: "గూఢచారి" టీం తోనే చేయమని శేష్ కి చెప్పిన మహేష్

Sriveni Erugu
Updated on: 2 Jun 2022 1:30 PM IST
Mahesh Babu advised Adivi Sesh | Tollywood News
X

అడివి శేష్ కి సలహా ఇచ్చిన మహేష్ బాబు

Mahesh Babu: యువ హీరో అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం 26/11 అటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుంది. గురువారం ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో టికెట్ లు అన్నీ బుక్ అయిపోయాయి. మహేష్బాబు ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ సినిమా వెనక ఉండటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌ క‌థ‌ని తెర‌పైకి తీసుకుని రావాల‌నుకున్న‌ప్పుడు ఈ ఆలోచ‌న‌ను శేష్ ముందు మ‌హేష్ తో పంచుకున్నాడ‌ట. "మీలాంటి వాళ్లు ఈ సినిమా వెనుక ఉంటే బాగా హెల్ప్ అవుతుంది" అని శేష్ చెప్పడంతో మ‌హేష్ బాబు కన్విన్స్ అయ్యాడట.

అయితే గూఢ‌చారి టీమ్ తో క‌లిసి చేస్తే సినిమా కి హెల్ప్ అవుతుంది అని మహేష్ శేష్ కి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. దాంతో 'గూఢ‌చారి' టీమ్‌ని అడ‌విశేష్ `మేజ‌ర్‌` కోసం రిపీట్ చేశారట. "గూఢ‌చారి" సినిమా అంటే చాలా ఇష్టం. అందులోని స్టైలిష్‌మేకింగ్ మహేష్ కి బాగా నచ్చిందట. అందుకే "గూఢ‌చారి" టీమ్ ని తీసుకోమ‌ని స‌లహా ఇచ్చాడు మహేష్. శేష్ కూడా వెంటనే ఓకే అనేశారట.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story