'మహర్షి' గురించి అప్డేట్ ఇచ్చిన డీఎస్పీ

మహర్షి గురించి అప్డేట్ ఇచ్చిన డీఎస్పీ
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రం తెరకెక్కనున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రం తెరకెక్కనున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మే 9 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. గత కొంత కాలంగా ఈ సినిమా అప్డేట్ ల కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రంలోని మొదటి పాట ఏప్పుడు విడుదల కాబోతుంది అనే తేదీని రివీల్ చేశారు.

"మహర్షి అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్న అందరికీ.. మహర్షి సినిమాలో మొదటి పాట 29 మార్చి విడుదల కాబోతోంది. ఈ లోపు నేను ఇద్దరూ క్యూట్ మహర్షిని లు నాకు డాన్స్ నేర్పుతున్న వీడియో చూసి ఆనందించండి" అంటూ ఒక వీడియోను షేర్ చేశాడు డి.ఎస్.పి. ఆ వీడియోలో మైక్ పట్టుకొని దేవి శ్రీ ప్రసాద్ 'చారుశీల.. స్వప్నబాల..' పాట పాడుతుండగా ఒక పక్క మహేష్ బాబు కూతురు సితార మరొకవైపు దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories