జోరుగా సాగుతున్న మహర్షి ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్

Ruthvik
Published on: 10 April 2019 11:59 AM IST
జోరుగా సాగుతున్న మహర్షి ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'మహర్షి'. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ పనులు కూడా మొదలు పెట్టింది ఈ చిత్ర బృందం. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రంలోనే కాక ఓవర్సీస్ లో కూడా 'మహర్షి 'మంచి రిలీజ్ బిజినెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే ఓవర్సీస్ డీల్ కూడా క్లోజ్ అయిందట. గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు 'మహర్షి' సినిమా రైట్స్ ను ఏకంగా 11.5 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, గల్ఫ్ మరియు మిగతా ఓవర్సీస్ రైట్స్ అన్ని కలిపి ఫైనలైజ్ అయింది. అయితే ఒకవేళ ఈ సినిమా గనుక 16 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంటే, నిర్మాతలకు కూడా షేర్ ఉండాలని షరతు పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే 'మహర్షి' ఓవర్సీస్ కు డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువమంది ముందుకు రాలేదు. ఫైనల్ గా 11.5 కోట్లకు బేరం కుదిరింది. కానీ ఒక రకంగా ఓవర్సీస్ రైట్స్ ఎక్కువ ధరకు అమ్ముడు అవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు చాలా వరకు రికవరీ చేయలేకపోతున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story