మహేష్ అభిమానులకు శుభవార్త

Ruthvik
Published on: 12 March 2019 12:00 PM IST
మహేష్ అభిమానులకు శుభవార్త
X

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'మహర్షి'. మహేష్ బాబు కెరీర్ లో 25 వ చిత్రం గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 25 వ తారీఖున విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం అవడం వల్ల ఈ సినిమాను మే9 వ తారీకు కి వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు అభిమానులకు ఒక శుభవార్త వినిపిస్తోంది. 'మహర్షి' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.

మహేష్ భార్య మరియు ఒకప్పటి నటి నమ్రతా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. "సినిమా షూటింగ్ పూర్తయింది. మహర్షి టీం తో, ఫ్రెండ్స్ తో ఫన్నీగా క్విక్ గా చెన్నైలో జరిగిన షెడ్యూల్ ముగిసింది. #ఆన్లొకేషన్ #మహర్షి" అంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు నమ్రత. ఈ ఫోటోలలో మహేష్ బాబు, నమ్రత, పిల్లలు గౌతమ్, సితార, మహేష్ క్లోజ్ ఫ్రెండ్ అగస్టీన్ జేవియర్ కుటుంబ సభ్యులు, దర్శకుడు వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ లు చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చారు.

Ruthvik

Ruthvik

Next Story