మహర్షి ఫస్ట్ హాఫ్ ఇలా ఉండబోతుందట

మహర్షి ఫస్ట్ హాఫ్ ఇలా ఉండబోతుందట
x
Highlights

మహేష్ బాబు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో మహాష్ బాబు 3 విభిన్న అవతారాలలో...

మహేష్ బాబు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో మహాష్ బాబు 3 విభిన్న అవతారాలలో కనిపించబోతున్నాడు అని తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి భాగం మొత్తం మహేష్ బాబు ఒక కాలేజీ స్టూడెంట్ లాగా కనిపించనున్నాడట.

ఇక ఈ సినిమా మొదటి భాగం మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని, సినిమాలో కామెడీ చాలా హిలేరియస్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మహేష్ బాబు, అల్లరి నరేష్ కలిసి పూజా హెగ్డేని ఏడిపించే సీన్లు అందరిని అలరిస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories