మహర్షి డే 1 కలెక్షన్లు..

మహర్షి డే 1 కలెక్షన్లు..
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25 వ చిత్రంగా 'మహర్షి' సినిమా నిన్న అనగా మే 9 న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కి వంశీ...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25 వ చిత్రంగా 'మహర్షి' సినిమా నిన్న అనగా మే 9 న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించారు. మహేష్ ఈ సినిమాలో 3 విభిన్న లుక్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఇక అనుకున్న విధంగానే ఈ సినిమాకి భారీ లెవెల్ లో ఓపెనింగ్స్ లభించాయి. హాట్ కేకుల్లా అమ్ముడైన ఈ చిత్ర టిక్కెట్లు 'మహర్షి' కి మంచి ఓపెనింగ్స్ ని సాధించి పెట్టాయి. ఈ సినిమా కి మొదటిరోజున అత్యధికంగా నిజాం ఏరియా లో 6.38 కోట్లు రాగా, నెల్లూరు లో కోటి రూపాయలు వసూళ్లు నమోదు చేసుకుంది. రెండు తెలుగురాష్ట్రాల్లో కలిపి 'మహర్షి' సినిమా 24.6 కోట్లు ఒక్క రోజులో వసూళ్లు చేసింది. ఇదే రేంజిలో మరికొన్ని రోజులు వసూళ్లు వస్తే, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.

మహర్షి డే 1 కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నిజాం - 6.38 కోట్లు

సీడెడ్ - 2.89 కోట్లు

యూఏ - 2.88 కోట్లు

ఈస్ట్ - 3.2 కోట్లు

వెస్ట్ - 2.47 కోట్లు

కృష్ణ - 1.39 కోట్లు

గుంటూరు - 4.4 కోట్లు

నెల్లూరు - 1 కోట్లు

ఆంధ్రప్రదేశ్+తెలంగాణ - 24.6 కోట్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories