డబ్బింగ్ పనులు పూర్తి చేయబోతున్న మహర్షి బృందం

డబ్బింగ్ పనులు పూర్తి చేయబోతున్న మహర్షి బృందం
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి...

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వేసవి కానుకగా మే 9న విడుదల కానుంది. అనుకున్న తేదీన విడుదల చేయడం కోసం ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం మహేష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పటం రేపటితో పూర్తవుతుందట. ఆ తరువాత మహేష్ బాబు కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏప్రిల్ ఆఖరి వారంలో ఈ సినిమాలో ఇంకా పెండింగ్ ఉన్న రెండు పాటల షూటింగ్ పూర్తి చేయనున్నాడు. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories