సరికొత్త స్టైల్ లో 'మహర్షి' ప్రమోషన్స్

Ruthvik
Published on: 23 March 2019 2:00 PM IST
సరికొత్త స్టైల్ లో మహర్షి ప్రమోషన్స్
X

గతేడాది 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్లోనే 25వ చిత్రం గా తెరకెక్కనున్న 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు 'మహర్షి' సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ఇంకా కొన్ని వారాలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో, చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనుంది.

ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమయిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మహర్షి సినిమా ప్రమోషన్స్ తో దర్శక నిర్మాతలు కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారని టాక్. 'మహర్షి' సినిమా కోసం బాలీవుడ్ స్టైల్ లో ప్రమోషన్ ఏర్పాటు చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. తన కెరీర్ లో మొదటిసారిగా మహేష్ బాబు ఈ సినిమా కోసం చాలా సీరియస్ గా కొన్ని ఏరియాలు పర్యటించబోతున్నారట. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Ruthvik

Ruthvik

Next Story