'స్పైడర్' తరువాత ఫ్లాపైన 'మహర్షి'

స్పైడర్ తరువాత ఫ్లాపైన మహర్షి
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విడుదలైన మొదటి రోజే పెద్దగా ప్రభావం చూపలేకపోయిన 'మహర్షి' సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద రెండవ వారం లో కనిష్ట వసూళ్లు నమోదు చేసుకుంది.

ఇక ఈ సినిమా బయర్లకు నష్టాలు మాత్రమే తీసుకురావచ్చని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.మొదటి వారాంతంలో లో 1.5 మిలియన్ డాలర్లను చేరుకున్న ఈ సినిమా రెండవ వారానికి వచ్చేసరికి కేవలం 168 కె డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్కు చేరే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు సైతం కొట్టిపారేస్తున్నారు. 'స్పైడర్' తరువాత మహేష్ కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా ఈ చిత్రం మారబోతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాగానే వసూలు చేస్తోంది. మంచి థియేటర్ ఆక్యుపెన్సీ ని నమోదు చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' సినిమా బాగానే జోరు చూపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories