Vijay Deverakonda: మహర్షి డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్రస్తుతం "మహర్షి" చిత్రం జాతీయ అవార్డు విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

Venkata Chari
Published on: 28 March 2021 9:05 AM IST
Maharshi Director to Join Hands with Vijay Deverakonda
X

విజయ్ దేవరకొండ, వంశీ పైడిపల్లి (ఫొటో హన్స్ ఇండియా)

Vijay Deverakonda: డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్రస్తుతం "మహర్షి" చిత్రం జాతీయ అవార్డు విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. 2019 నుంచి కొత్త సినిమాను ప్రకటించలేదు ఈ డైరెక్టర్. తాజాగా వంశీ త్వరలో విజయ్ దేవరకొండతో జతకట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మహర్షి తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా చేయాలని వంశీ ప్లాన్ చేశాడు. అయితే, మహేష్ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ చేయలేదు. పరశురామ్ డైరెక్షన్ లో "సర్కారు వారి పాట"కు ఓకే చెప్పి... ఆ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రిన్స్. దాంతో డైరెక్టర్ వంశీకి అనుకోకుండానే గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో తన తదుపరి సినిమా కోసం ఓ స్టోరీ రెడీ చేసి, ఇటీవల విజయ్‌ దేవరకొండకు వినిపించాడని సమాచారం. ఈ స్టోరి విజయ్ కు నచ్చడంతో... త్వరలోనే పట్టాలెక్కనుందని టాక్ నడుస్తోంది.

విజయ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ లైగర్‌ పూర్తి అయిన తరువాత వంశీతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమాలో..అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 9 న తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో ఏకకాలంలో విడుదల కానుంది. వంశీ పైడిపల్లితో ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story