కాసుల వర్షం కురిపిస్తున్న మహర్షి

కాసుల వర్షం కురిపిస్తున్న మహర్షి
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ కెరీర్ లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మే 9న భారీ అంచనాల మధ్య విడుదలైంది 'మహర్షి' సినిమా. పూజా హెగ్డే హీరోయిన్ గా...

టాలీవుడ్ సూపర్ స్టార్ కెరీర్ లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మే 9న భారీ అంచనాల మధ్య విడుదలైంది 'మహర్షి' సినిమా. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్యపాత్ర పోషించారు. అనుకున్న విధంగానే ఈ సినిమాకు ఓపెనింగ్ డే రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ప్రస్తుతం 'మహర్షి' సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

'భరత్ అనే నేను' సినిమా తర్వాత మరొక సూపర్ హిట్ అందుకోవడంతో మహేష్ బాబు అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దిల్ రాజు అశ్వినీదత్ పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఒకవైపు తెలుగు రాష్ట్రంలోనే కాక ఓవర్సీస్లో కూడా 'మహర్షి' సినిమా కలెక్షన్ల పరంగా మంచి జోరు కనబరుస్తోంది. కేవలం ఐదు రోజులలో 'మహర్షి' సినిమా 4.11 కోట్ల వసూళ్లను నమోదు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' ఐదవ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నైజాం: 1.86 కోట్లు

సీడెడ్: 53 లక్షలు

యూఏ: 54 లక్షలు

కృష్ణ: 27.4 ఈస్ట్

గుంటూరు: 22.5 ఈస్ట్

ఈస్ట్: 30 ఈస్ట్

వెస్ట్: 23 ఈస్ట్

నెల్లూరు: 14.62 లక్షలు

మొత్తం: 4.11 కోట్లు

రోజులవారిగా 'మహర్షి' కలెక్షన్ల బ్రేక్ డౌన్ ఇలా ఉంది:

డే 1: 24.67 కోట్లు

డే 2: 7.96 కోట్లు

డే 3: 8.01 కోట్లు

డే 4: 8.26 కోట్లు

డే 5: 4.11 కోట్లు

టోటల్: 53 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories