రేపే 'మహర్షి' కి ఆఖరి రోజు

రేపే మహర్షి కి ఆఖరి రోజు
x
Highlights

గతేడాది 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన 'మహర్షి' షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి...

గతేడాది 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన 'మహర్షి' షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఒక పాట వీడియో లో నరేష్, పూజ మరియు మహేష్ లు సినిమాలో క్లాస్మేట్ గా కనిపిస్తారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం 'మహర్షి' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందట. ఇంకా ఒక్కరోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. రేపు అనగా ఏప్రిల్ 18న మహర్షి షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు మూడు సరి కొత్త లుక్స్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాల మధ్య 'మహర్షి' సినిమా మే9న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories