Actress: మహా రాజా నటి ఇంత గ్లామర్‌గా ఉంటుందా.? ఇంతకీ ఎవరో తెలుసా.?

Actress: మహా రాజా నటి ఇంత గ్లామర్‌గా ఉంటుందా.? ఇంతకీ ఎవరో తెలుసా.?
x
Highlights

Actress: హీరోయిన్లు అనగానే గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అనే భావన చాలా మందిలో ఉంటుంది.

Actress: హీరోయిన్లు అనగానే గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే కొందరు నటీమణులు అటు గ్లామర్‌ పాత్రలతో పాటు ఇటు నటనకు ప్రాధాన్యత ఉన్న డీగ్లామర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఓ నటీమణి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన 'మహారాజ' మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? చీర కట్టులో డీగ్లామర్‌ రోల్‌లో నటించింది. అయితే ఈ సినిమాలో ఇలా కనిపించిన ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార దివ్య భారతి.

సోషల్‌ మీడియాలో భారీ క్రేజ్‌ ఉన్న ఈ చిన్నది మహారాజ మూవీలో ఇలా తళుక్కుముంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. తొలి సినిమాలో తన గ్లామర్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమాతో దివ్య భారతి ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది. తొలి సినిమా విజయంతో వెనువెంటనే వరుస అవకాశాలు ఈ బ్యూటీకి క్యూ కట్టాయి.

మధిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, ఆసై, మహారాజా వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందీ చిన్నది. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది దివ్య భారతి. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేస్తూ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories