Maha Shivaratri: రేపు 4 సినిమాలు రిలీజ్: క్రేజ్ అంతా ఆ మూడింటిపైనే..

Maha Shivaratri Special: మహాశివరాత్రి సందర్భంగా ఈ వారం 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Venkata Chari
Published on: 10 March 2021 6:17 PM IST
Maha Shivaratri 2021 Special Movies releases on 11-03-2021
X

గురువారం రిలీజ్ కానున్న సినిమాలు

Maha Shivaratri Special: మహాశివరాత్రి సందర్భంగా ఈ వారం 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో 3 సినిమాలు.. 'గాలి సంపత్', 'జాతిరత్నాలు', 'శ్రీకారం' కాగా ఒకటి కన్నడ డబ్బింగ్ సినిమా 'రాబర్ట్'బాక్సాపీస్ వద్దకు రానున్నాయి. అయితే, 3 తెలుగు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా ఆయా టీంలు ప్రచారం చేస్తున్నాయి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లు కూడా గ్రాండ్ గా చేపట్టారు.

శర్వానంద్ 'శ్రీకారం' సినిమాకు చిరంజీవి ప్రచారం కల్పించగా.. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ నటించిన 'జాతిరత్నాలు' సినిమా ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ వచ్చారు. అలాగే, డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ల కాంబినేషన్ లో వస్తున్న 'గాలి సంపత్'కు హీరో రామ్ ప్రచారం కల్పించారు. కాగా, ఈ మూడు సినిమాల విడుదలతో బాక్సాపీస్ వద్ద టఫ్ ఫైట్ జరగనుంది. ఏ మూవీ అంచనాలను అందుకుటుందో చూడాలి మరి.

1. శ్రీకారం (Sreekaram)

నటీనటులు: శర్వానంద్ (Sharwanand), ప్రియాంక అరుళ్ (Priyanka Arul)

డైరెక్టర్: కిషోర్ రెడ్డి (Kishore Reddy)

2. గాలి సంపత్ (Gaali Sampath)

నటీనటులు: శ్రీ విష్ణు (Sree Vishnu), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)

డైరెక్టర్: అనీష్ (Anish Krishna)

స్కీన్ ప్లే: అనిల్ రావిపూడి (Anil Ravipudi)

3. జాతి రత్నాలు (Jathi Ratnalu)

నటీనటులు: నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna)

డైరెక్టర్: అనుదీప్

4. రాబర్ట్ (Roberrt)

నటీనటులు: దర్శన్ (Darshan), జగపతి బాబు (Jagapati Babu)

డైరెక్టర్: తరుణ్ సుధీర్ (Tarun Sudhir)


Venkata Chari

Venkata Chari

Next Story