Soorarai Pottru Remake Case: సూర్యకి ఊరటనిచ్చిన మద్రాస్ హైకోర్టు

* కోలీవుడ్ హీరో సూర్య ముందు సినిమా 'ఆకాశం నీ హద్దురా' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

admin1
Updated on: 10 Sept 2021 2:00 PM IST
Madras High Court has Cancel the Stay Order of Surya Soorarai Pottru Movie Remake Case
X

సూర్యకి ఊరటనిచ్చిన మద్రాస్ హైకోర్టు (ఫోటో: బార్ అండ్ బెంచ్)

Soorarai Pottru: కోలీవుడ్ హీరో సూర్య ముందు సినిమా 'ఆకాశం నీ హద్దురా' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో 'సూరారై పొట్రు' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులతో పాటు వేరే భాషల్లో కూడా అమేజాన్‌ ప్రైమ్‌ పుణ్యమా అని మంచి ఆదరణ సంపాదించింది. అనేక పురస్కారాలకు ఈ సినిమా ఎంపికవడం విశేషం. "సూరారై పొట్రు" ను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి సూర్య హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది.

హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ హీరో అని వార్తలు కూడా వచ్చాయి కానీ ఈ సినిమా మొదలుపెట్టే సమయంలో సూర్య అండ్ కోకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శిఖ్య ఎంటర్టైన్మెంట్ తమ అనుమతి లేకుండానే హిందీ రీమేక్ తీస్తున్నారంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు రీమేక్ పై స్టే విధించింది. ఐతే ఇంతకుముందు ఇచ్చిన స్టేని రద్దు చేస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో సూర్యకి ఊరట లభించింది. ఇక అడ్డంకులు తొలగిపోవడంతో ప్రి ప్రొడక్షన్ పనులు పున:ప్రారంభించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

admin1

admin1

Next Story