అసలు అలాంటి సన్నివేశాన్ని పెట్టాల్సిన అవసరం లేదు అంటున్న హీరోయిన్..

* ఖరీదైన లిప్ లాక్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Dhatripriya
Updated on: 5 Feb 2023 8:31 PM IST
Madhuri Dixit Says There Is No Need To Put Such A Scene
X

 అసలు అలాంటి సన్నివేశాన్ని పెట్టాల్సిన అవసరం లేదు అంటున్న హీరోయిన్..

Madhuri Dixit: కొన్ని కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని పనులు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్లు అయినా కొన్నిసార్లు దర్శక నిర్మాతలు చెప్పిన పనిని రాజీ పాడైనా సరే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దాని గురించి చర్చ ఏర్పడితే దానికి వివరణ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తాజాగా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ కు ఎదురుపడింది.

ఈమధ్య కాలంలో సినిమాలలో లిప్ లాక్ అవసరం ఉన్నా లేకపోయినా డైరెక్టర్లు అలాంటి సన్నివేశాలను చూపిస్తున్నారు. కానీ 40 ఏళ్ల క్రితం లిప్ లాక్ అంటే ఒక సంచలనం అని చెప్పుకోవాలి. నిజంగా అవసరం ఉన్నా కూడా అలాంటి సన్నివేశాల్లో నటిస్తే అది పెద్ద చర్చనీయాంశంగా మారేది. వివరాల్లోకి వెళితే 1988 వినోద్ ఖన్నా హీరోగా నటించిన దయావణ్ అనే సినిమాలో మాధురి దీక్షిత్ హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలో మాధురి దీక్షిత్ ఒక ఘాటైన లిప్ లాక్ సన్నివేశంలో కూడా నటించింది. అయితే అవసరం లేకున్నా ఈమె అలాంటి సన్నివేశంలో నటించింది అంటూ అప్పట్లో చాలానే విమర్శలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా మాధురి దీక్షిత్ కేవలం ఆ ఒక్క సీన్ కోసం కోటి రూపాయలు రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్లు టాక్ వచ్చింది.

తాజాగా ఈ ఖరీదైన లిప్ లాక్ గురించి మాధురి దీక్షిత్ కూడా జవాబు ఇచ్చారు. అవసరం లేకుండానే అలాంటి సన్నివేశాలు పెట్టారు అనిపించింది అని మాధురి దీక్షిత్ స్వయంగా ఒప్పుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story