Ram Movie: రామ్ సినిమాలో విలన్ గా హీరో మాధవన్

Ram Movie: రెడ్ మూవీ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటించే సినిమాలో మరో స్టార్ మాధవన్ నటించబోతున్నట్లు టాక్.

Kranthi
Updated on: 3 Jun 2021 1:49 PM IST
Madhavan Playing a Villain Role in Ram Movie
X

నటుడు మాధవన్ (ఫైల్ ఫోటో)

Ram Movie: సినిమా మార్కెట్ కావాలన్నా.. మంచి బిజినెస్ అవ్వాలన్నా ఇప్పుడు స్టార్ కేస్టింగ్ బాగా ఇంపార్టెంట్ గా మారింది. ఆ సినిమాలో ఎవరెవరు ఉన్నారనేదాన్ని బట్టి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ ప్రాజెక్టులు ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. రెడ్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటించే సినిమాలో మరో స్టార్ మాధవన్ నటించబోతున్నట్లు టాక్. ఇందులో ఆయన విలన్ పాత్ర పోషిస్తారని సమాచారం. అలా రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్టుగా మారబోతుంది.

రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సంచలన విజయాన్ని సాధించింది. రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఆయన చేసిన 'రెడ్' ఆశించినస్థాయిలో ఆడలేదు. అయినా రామ్ డీలాపడిపోకుండా తన తదుపరి సినిమాను వెంటనే లైన్లో పెట్టేశాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. రామ్ సరసన నాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసింది కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది.

ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అందుకు సమాధానంగా ఇప్పుడు మాధవన్ పేరు వినిపిస్తోంది. ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఇంతకుముందు 'సవ్యసాచి' సినిమాలో విలన్ గా మాధవన్ మెప్పించాడు. కూల్ గా ఆయన చేసిన విలనిజం ప్రేక్షకులకు బాగా నచ్చింది. కానీ ఆ సినిమా విజయానికి దూరంగానే ఉండిపోయింది. ఆ తరువాత 'నిశ్శబ్దం'లోను నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేశాడు.

Kranthi

Kranthi

Next Story