Manchu Vishnu: బాలకృష్ణతో భేటీ అయిన మంచు విష్ణు

*బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను : విష్ణు *మా ఎన్నికల్లో మొదటి నుంచి బాలకృష్ణ సహకరించారు : విష్ణు

Shilpa
Published on: 14 Oct 2021 1:24 PM IST
MAA President Manchu Vishnu Meets Balakrishna with his Father MohanBabu
X

బాలకృష్ణతో భేటీ అయిన మంచు విష్ణు(ఫైల్ ఫోటో)

Manchu Vishnu: మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు, త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి హీరో నంద‌మూరి బాలకృష్ణను క‌లిశాడు. ఈ సందర్భంగా బాల‌కృష్ణ ఆశీర్వాదం తీసుకోవ‌డానికి వచ్చాన‌ని విష్ణు తెలిపారు. 'మా' ఎన్నిక‌ల్లో మొద‌టి నుంచి బాలకృష్ణ స‌హ‌క‌రించారని చెప్పాడు. ఇప్పటికే తాను కోట శ్రీ‌నివాస‌రావు, కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజు, ప‌రుచూరి బ్రదర్స్ లాంటి వారిని క‌లిశానని, ఇప్పుడు బాలయ్యను క‌లిశాన‌ని వివ‌రించారు. పెద్దలందరినీ క‌లుస్తానని, అంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ్తానని తెలిపాడు.



Shilpa

Shilpa

Next Story