MAA: కీలక నిర్ణయం తీసుకున్న 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు

*ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాకు ఆమోదం *మరో వారంలో 'మా' భవనంపై ప్రకటన చేస్తామన్న విష్ణు

Sandeep Reddy
Updated on: 12 Dec 2021 5:01 PM IST
MAA President Manchu Vishnu Approved Prakash Raj Pannel Members Resignation
X

 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు (ఫైల్ ఫోటో) 

MAA: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాజీనామాలు చేశారు ప్రకాష్ రాజ్‌ ప్యానల్ సభ్యులు. అయితే, ఈ రాజీనామాలను వెనక్కు తీసుకోవాలని కోరినా ప్రకాష్ ప్యానల్ వెనక్కు తగ్గకపోవడంతో మా అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఆ రాజీనామాలను ఆమోదించారు.

ఇదే సమయంలో ప్రకాష్ రాజ్, నాగబాబు సభ్యత్వాల రాజీనామాలను మాత్రం విష్ణు ఆమోదించలేదు. ఇక రాజీనామా చేసిన 11 మంది సభ్యల స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. అలాగే, 'మా' భవనంపై మరో వారంలో ప్రకటన ఉంటుందని విష్ణు స్పష్టం చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story