MAA: కృష్ణంరాజు అధ్యక్షతన 'మా' సమావేశం..సెప్టెంబర్‌ 26న 'మా' ఎన్నికలు?

MAA: కృష్ణంరాజు అధ్యక్షతన మా సమావేశం..సెప్టెంబర్‌ 26న మా ఎన్నికలు?
x
Highlights

* ఎన్నికల నిర్వహణపై డీఆర్‌సీదే తుది నిర్ణయం * సెప్టెంబర్‌ 26న ‘మా’ ఎన్నికలు? * వారం రోజుల్లో ఎన్నికల తేది ప్రకటన

MAA Meeting: గత రెండు నెలలుగా 'మా' ఎన్నికలపై వాడీవేడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. వీలైనంత త్వరగా 'మా' ఎన్నికలు నిర్వహించాలని పలువురు కోరిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన నిన్న 'మా' సర్వసభ్య సమావేశం జరిగింది. డీఆర్‌సీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. ఎన్నికలకు సంబంధించి తుది నిర్ణయం డీఆర్‌సీదే అని వెల్లడించారు.

వర్చువల్‌ విధానంలో రెండు జనరల్‌ బాడీలు మీటింగ్‌లు జరిగాయి. "మా"లోని కీలక సభ్యులు పాల్గొని సమస్యలను, ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపారు. రెండో సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికలు అత్యంత త్వరగా జరిగేలా చూడాలని కృష్ణంరాజు కోరారు. వీలైతే సెప్టెంబర్‌ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మా కార్యదర్శి జీవిత కూడా ఈ రెండు తేదీల్లోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

బైలాస్‌ ప్రకారం ఏజీఎమ్‌ నిర్వహించిన 21 రోజులకు ఎన్నికలు నిర్వహించాలి. సభ్యులు కోరినట్టు 12న త్వరితగతిన ఎన్నికలు నిర్వహించడం కష్టం. మరో ఆప్షన్‌గా ఉన్న 19వ తేదిన నిర్వహించే ఛాన్స్‌ ఉంది. అయితే ఆ రోజు గణేశ్‌ నిమజ్జనం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు కూడా ఎన్నికలు జరగకపోవచ్చు.

వర్చువల్ మీటింగ్‌లో మోహన్ బాబు సీరియస్‌గా స్పందించారు. ''ఏం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహారం ఉందన్నారు. ఇక్కడ అందరూ మేధావులే. ఒకరిని అనే స్థితిలో ఎవరూ లేరు. నటనలో గొప్పవారైనందరూ నా ఫ్యామిలీ గొప్పంటే నా కుటుంబం గొప్ప అని కబుర్లు చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. రూపాయికి భవనం కొనుగోలు చేసి అర్ధ రూపాయికి ఎందుకు అమ్మేశారని ఆయన ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories