MAA New Working Team - Tirupathi: టీటీడీ లో మా నూతన కార్యవర్గం

*మా అధ్యక్షుడు పదవి అంటే ఓ బాధ్యత : మోహన్ బాబు *అందరి కృషి వల్లే గెలిచాం : మంచు విష్ణు

Shilpa
Updated on: 18 Oct 2021 12:44 PM IST
MAA New Working Team Visits Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మా నూతన కార్యవర్గం(ఫైల్ ఫోటో)

MAA New Working Team - Tirupathi: విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదన్నారు. అదో బాధ్యత అని గౌరవ ప్రధమైన హోదా అని అన్నారు. అందరి కృషి వల్లే గెలిచామని మంచు విష‌్ణు అన్నారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి ఎలాంటి రాజీనామాలు రాలేదని ఆయన తెలిపారు.

మంచు విష్ణు తన టీంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తన తండ్రి మోహన్‌ బాబు, 'మా' నూతన కార్యవర్గంతో కలిసి విష్ణు ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు 'మా' నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు.

Shilpa

Shilpa

Next Story