Hema: అందుకే శివబాలాజీ చేయి కొరికా

MAA Elections: మా’ ఎన్నికల ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 10 Oct 2021 2:08 PM IST
Hema: అందుకే శివబాలాజీ చేయి కొరికా
X

Hema: అందుకే శివబాలాజీ చేయి కొరికా

MAA Elections: మా' ఎన్నికల ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. చిన్న చిన్న వివాదాలు మాత్రమే అక్కడ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో శివ బాలాజీ చెయ్యి హేమ కొరికినట్టు కొద్ది సేపటి క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాను శివబాలాజీ చెయ్యి ఎందుకు కొరికాను అనే విషయంలో హేమ ఎక్స్ ప్లైనేషన్ ఇచ్చారు. తాను వెళుతున్న టైమ్ లో శివ బాలాజీ చెయ్యి అడ్డుగా పెట్టారని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చెయ్యి కొరకాల్సి వచ్చిందని హేమ తెలిపారు. దాని వెనక అంతకన్నా ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోందని హేమ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story