MAA Elections: అక్టోబర్ 10న జరగనున్న "మా" ఎన్నికలు

admin1
Updated on: 26 Aug 2021 3:15 PM IST
MAA Elections Date 10 10 2021 Announced By Krishnam Raju
X

అక్టోబర్ లో మా ఎన్నికలు (ఫైల్ ఫోటో)

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈసారి మా ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వచ్చాయి. తాజాగా మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అయిన కృష్ణంరాజు మా ఎలక్షన్ల గురించి ఒక ముఖ్యమైన అప్ డేట్ ను విడుదల చేశారు. ప్రెస్ మీట్ ప్రకారంగా మా ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి అని తెలుస్తోంది. అక్టోబర్ 10 ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ప్రకటించింది.

మా ఎన్నికలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరగాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవి, హేమ తదితరులు కమిటీవారిని చాలాసార్లు కోరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ మా ఫౌండింగ్ మెంబర్స్ లో ఒకరైన మురళీమోహన్ సెప్టెంబర్ రెండవ వారం లేదా అక్టోబర్లో ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇక పుకార్లకు చెక్ పెడుతూ మా ఎన్నికలు అక్టోబర్ 10న జరుగుతాయని క్లారిటీ ఇచ్చింది అసోసియేషన్. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, మరియు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్ కూడా ఈసారి ఎన్నికలలో పాల్గొనబోతున్నారు. మెగా కాంపౌండ్ మొత్తం ప్రకాష్ రాజ్ కు తమ మద్దతు పలికారు.

admin1

admin1

Next Story