MAA: నేడు "మా" అధ్యక్ష ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశం

* ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ *'మా' అధ్యక్ష పదవి బరిలో ప్రకాశ్ రాజ్, విష్ణు, జీవితా, హేమ, సీవీఎల్

Sandeep Reddy
Published on: 22 Aug 2021 9:43 AM IST
MAA Election Date may Announce Today 22 08 2021 in MAA General Body Meeting
X

మా అసోసియేషన్ (ఫైల్ ఫోటో)

MAA: 'మా' ఎన్నికల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. నేడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. మా జనరల్ బాడీ మీటింగ్ అనంతరం ఎన్నికలపై ప్రకటన ఉండొచ్చు. ఈ సమావేశంలో ఏకగ్రీవంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఇప్పటికే ముగియగా ఎన్నికలు నిర్వహించాలని లేఖల్లో కోరారు సభ్యులు. 'మా' అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేయాలనిబావిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికి వారు ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటూ సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో కూడా ఉన్నారు. తాజా మీటింగ్ లో ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story