సిరివెన్నెలను కబళించిన న్యూమోనియా, లంగ్ కేన్సర్

Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల ఆరోగ్యం గత కొంత కాలంగా క్షీణిస్తూ వచ్చింది.

Arun Chilukuri
Updated on: 30 Nov 2021 6:27 PM IST
Lyricist Sirivennela Sitarama Sastry Dies of Lung Cancer
X

సిరి వెన్నెలను కబళించిన న్యూమోనియా, లంగ్ కేన్సర్

Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల ఆరోగ్యం గత కొంత కాలంగా క్షీణిస్తూ వచ్చింది. ఊపిరి తిత్తులకు కేన్సర్ సోకడంతో వాటిలో కొంత భాగం తొలగించారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా అయ్యింది. న్యూమోనియా రావడంతో ఆయన ఇంటిలోనే ఉంటూ మందులు వాడుతున్నారు. శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో ఈనెల24న ఆయన్ను కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి నిరంతర వైద్య సేవలందిస్తున్నప్పటికీ ఇమ్యూనిటీ తగ్గడంతో ఆరోగ్యం విషమిస్తూ వచ్చింది.

ఐసీయూలో వెంటిలెటేర్ పై ఉంచి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఒకదశలో సిరివెన్నెల కోలుకుంటారని అందరూ భావించారు. కానీ ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణిస్తూ వచ్చింది. ట్రీట్ మెంట్ కు స్పందించకపోవడంతో ఆయనకు ఎక్మో వైద్య సేవలు కూడా అందించారు. అయినప్పటికీ ఇమ్యూనిటీ తగ్గి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన కన్నుమూశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story