Chiranjeevi Lucifer: లూసీఫర్ రీమేక్ టైటిల్ 'వీరయ్య'?

Chiranjeevi Lucifer: లూసిఫర్ రీమేక్ సినిమా టైటిల్ వీరయ్య అనే టైటిల్ ఎలా ఉంటుందనే ఆలోచిస్తున్నారట చిత్ర యూనిట్

Kranthi
Published on: 6 July 2021 7:58 AM IST
Lucifer Becomes Veerayya in Telugu
X

Chiranjeevi Lucifer Movie:(Twitter)

Chiranjeevi Lucifer: ఆచార్య సినిమా త్వరలో మెగా ప్రేక్షకులకు ఫీస్ట్ అందివ్వనున్నది. అయితే కోవిడ్ ఎఫెక్ట్ తో అది లేటవుడంతో.. చిరంజీవి తర్వాత సినిమాలపై కూడా అభిమానాలు ఆరాలు తీస్తున్నారు. ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఇప్పటికే దీనికి మోహన్ రాజాను డైరెక్టర్ గా ఎంచుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. లూసిఫర్ అనేది కేరళ క్రిస్టియన్ పేరు కావడంతో... ఇక్కడ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పేరు ఏం పెట్టాలా అని చిత్ర యూనిట్ ఆలోచిస్తుందంట. వీరయ్య అనే టైటిల్ ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందంట.

ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తమన్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. కాగా, ఇప్పుడు టైటిల్‌ను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారు దర్శకుడు మోహన్‌రాజా.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా 'వీరయ్య' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. చిరు ఇందులో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. సత్యదేవ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా ఓకే చెప్పినట్లు సమాచారం. 'ఆచార్య' షూట్‌ పూర్తయిన వెంటనే చిరు ఈ సినిమా చిత్రీకరణ పాల్గొంటారు.

Kranthi

Kranthi

Next Story