Tollywood: రవితేజ సరసన "గాలి సంపత్" హీరోయిన్

Tollywood: 'గాలి సంపత్' సినిమా హీరోయిన్ లవ్లీ సింగ్ కు రవితేజ సినిమాలో ఛాన్స్!

Kranthi
Published on: 9 March 2021 3:38 PM IST
Lovely Singh to Pair With Ravi Teja in his Next Movie
X

ఇమేజ్ సోర్స్: న్యూస్ బగ్స్.కం

Tollywood: 'గాలి సంపత్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన మరో ముద్దుగుమ్మ లవ్లీ సింగ్. ఈ సినిమా విడుదల కాకుండానే ఈ చిన్నదానికి తెలుగులో అప్పుడే మరో ఛాన్స్ వచ్చేసింది. అదీ రవితేజ సరసన నటించే అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ టాక్.

ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరిగా తాజాగా లవ్లీ సింగ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో కామెడితో కూడిన చిత్రాలకు కారాఫ్ అడ్రస్ గా నిలిచాడు మన అనిల్ రావిపూడి. తన స్నేహితుడు ఎన్. గాతి సంపత్ సినిమాకు కృష్ణ రచయితగా, నిర్మాతగా తీస్తున్న చిత్రానికి అనిల్ రావిపూడి స్ర్కిప్ట్ అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Kranthi

Kranthi

Next Story