Love Today: రోజురోజుకీ పెరుగుతున్న "లవ్ టుడే" కలెక్షన్లు

Love Today: తెలుగులో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు చేస్తున్న "లవ్ టుడే"

Jyothi
Published on: 28 Nov 2022 8:46 AM IST
Love Today Collections are Growing Day by Day
X

Love Today: రోజురోజుకీ పెరుగుతున్న "లవ్ టుడే" కలెక్షన్లు

Love Today: ప్రదీప్ రంగనాథన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఈ మధ్యనే ప్రేక్షకుల మందికి వచ్చిన సినిమా "లవ్ టుడే". తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాని తాజాగా తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. నవంబర్ 25న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్లను నమోదు చేసుకుంటుంది. కేవలం తమిళ్లో ఈ సినిమా ఇప్పటికే 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఇక తెలుగులో కూడా సినిమా జోరు ఎక్కువగానే కనిపిస్తోంది..విడుదలైన రెండవ రోజు కూడా కలెక్షన్లు అంతే స్ట్రాంగ్ గా ఉండడం అభిమానులను సైతం షాక్ కి గురి చేస్తున్నాయి రెండు రోజులు పూర్తయ్యేసరికి తెలుగు డబ్బింగ్ వర్షన్ 4.5 కోట్లను వసూలు చేసింది.

ఇక విడుదలైన మొదటి రోజు సినిమా కలెక్షన్లు రెండు కోట్ల గ్రాస్ కాగా రెండవ రోజు 2.5 కోట్లను వసూలు చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా యువత ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినిమా ఇదే జోరు కనబరిస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా కలెక్షన్లు 15 కోట్లు చేరుకునేటట్లు కనిపిస్తోంది. ఇవానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సత్యరాజ్, యోగి బాబు, రవినా రవి తదితరులు ముఖ్యపాత్రులు పోషిస్తున్నారు. ఈతరం ప్రేమ కథల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ కాలంలో ప్రేమ మరియు రిలేషన్షిప్ ల గురించి సినిమాలో చాలా బాగా చూపించారు ఇద్దరు ప్రేమికులు 24 గంటల పాటు తమ ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అనే చిన్న పాయింట్తో విడుదలైన ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Jyothi

Jyothi

Next Story