Love Story Update: 'లవ్ స్టోరి' రిలీజ్ డేట్ ఫిక్స్...ఎప్పుడంటే..

Love Story Update: హీరో నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరి సినిమా ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది

Kranthi
Published on: 10 July 2021 9:37 AM IST
Naga Chaitanya sai Pallavi Sekhar Kammula Love Story to Release in August-7th
X

Naga Chaitanya, sai Pallavi 

Love Story Update: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ల్ స్టోరి సినిమా ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గత ఏప్రిల్ 16న విడుదలకావాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పాటికే పాటలు, టీజర్ వంటి వాటితో ఈ సినిమాకు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. ఇక నాగచైతన్య 'మజిలీ, వెంకీ మామ' లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు 'ఫిదా'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడం, ఇక మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.

ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం 'సారంగ దరియా' సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే రెండు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమాను ఇటు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనుంది చిత్రబృందం. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు.

సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటూ కొత్తరకమై సినిమాలను పరిచయం చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరి తో మరో సారి తెరపై తన సత్తా చూపించనున్నాడు. దీని కోసం ఆగస్టు 7వ తేదీ వరకు ఆగాల్సిందే మరి.

Kranthi

Kranthi

Next Story