Love Story: "లవ్‌స్టోరీ' విడుదల వాయిదా

Love Story: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా వస్తున్న సినిమా 'లవ్‌స్టోరీ'.

Venkata Chari
Updated on: 8 April 2021 8:09 PM IST
Love Story Release Postponed Due To Carona
X

నాగచైతన్య, సాయిపల్లవి (ఫొటో ట్విట్టర్)

Love Story: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా వస్తున్న సినిమా 'లవ్‌స్టోరీ'. ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ పేర్కొన్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సినిమా విడుదల తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేశామని డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా 'లవ్‌స్టోరీ' అని పేర్కొన్నారు.

ఇప్పటివరకూ విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని హీరో నాగ చైతన్య అన్నారు. శేఖర్‌ కమ్ముల నాకు ఒక మంచి సినిమా ఇచ్చాడని, సినిమా అంతా పూర్తయిన తర్వాత విడుదల వాయిదా వేయాలంటే నిర్మాతలకు చాలా ధైర్యం ఉండాలని చైతన్య అన్నారు.

పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించిన పాటలు విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా 'సారంగదరియా' పాట విశేష ప్రజాదరణ పొందింది. అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ కాంబోలో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story