Love Story Movie: అందుకే సినిమా హిట్ అయింది అంటున్న అభిమానులు

Love Story Movie: * చిత్ర ఈవెంట్ కి చిరంజీవి మరియు ఆమిర్ ఖాన్ రావడం * చాలా కాలం తర్వాత థియేటర్ లలో విడుదల కావడం.

admin1
Updated on: 28 Sept 2021 2:30 PM IST
Love Story Movie has Three Reasons to Hit | Cinema News Today
X

లవ్ స్టోరీ సినిమా(ఫోటో- ది హన్స్ ఇండియా)

Love Story Movie: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మరియు ఫిదా బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన సినిమా "లవ్ స్టోరీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు రేకెత్తించింది. ట్రైలర్ మరియు పాటలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఒక మనసుకి హత్తుకునే ప్రేమకథ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "ప్రేమమ్" తరువాత నాగచైతన్య మరియు సాయి పల్లవి కాంబో లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండవ సినిమా ఇది.

సినిమా సెప్టెంబర్ 24, 2021 థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఈ "లవ్ స్టోరీ" హిట్ అవ్వడానికి గల కారణాల్లో మూడు ముఖ్యంగా చెప్పచ్చు. మొదటిది చిత్ర ఈవెంట్ కి చిరంజీవి మరియు ఆమిర్ ఖాన్ రావడం సినిమాకి బాగా వర్కౌట్ అయింది. రెండవది చాలా కాలం తర్వాత థియేటర్ లలో విడుదల కావడం. అయితే సినిమా హిట్ అవడానికి గల మూడో కారణం మాత్రం సమంత మరియు నాగ చైతన్య విడిపోబోతున్నారు అనే వార్త. వారిద్దరి మధ్య ఏం జరుగుతోందో అనే ఆసక్తి సినిమాకి బాగానే హైప్ ఇచ్చింది అని చెప్పచ్చు.

admin1

admin1

Next Story